Wednesday, April 1, 2015

శ్రీ మన్మధ నామ సంవత్సర నవ నాయక ఫలము


శ్రీ మన్మధ నామ సంవత్సర నవ నాయక ఫలము

{ 2015 -2016}

 

రాజు :- శని

ప్రజల జీవనప్రమాణములు వ్రుద్దిగా ఉండుట, ప్రభుత్వముల మధ్య  భేదములు, విదేశీ ప్రయాణములుతో సమర్ధ వతమైన పరిపాలన ఉండగలదు, సరిహద్దు లలో యుద్ధ వాతావరణము ఉండగలదు, వెండి,బంగారం,ధాన్యముల ధరలు పడిపోవుట, విదేశి మారకద్రవ్యములు పెరుగుట, ప్రజలు అధర్మ మార్గములో సంచరించుట, పంటల దిగుబడి  ఉండును, విచిత్ర వృష్టి ఉండును.  

మంత్రి :- కుజుడు 

  నగరములయందు అల్లర్లు, అగ్ని ప్రమాదములు, ప్రపంచములో కొన్ని దేశాల మద్య యుద్ధ వాతావరణము, భార్య భర్తల మద్య విరోధములు, కంప్యుటర్, ఎలట్రానిక్, కొత్త వ్యపారములు, అభివృద్ద కరముగా ఉండును, వాహన ప్రమాదములు అధికము, నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు అనేకము వచ్చుటచే వారికీ మంచి సమయము.      

సైన్యాధిపతి :- చంద్రుడు 

ఆయుధ సంపత్తు పరుగుట,సరి హద్దు ప్రాంతములు పటిష్టముగా ఉండుట, దేశ సరిహద్దు తగాదాలు పెరుగును, పకృతి విపరీతములలొ సైన్యము సహకరించుట, మంచి వృష్టి,  బాగుండును, భయానక సంఘటనలు ఉండగలవు, పల పర్స్రమాలు అభివృద్ధి చెందగలవు. 

సస్యాధిపతి :- శుక్రుడు 

వ్యవసాయమునకు మంచి సమయము, మెట్టలుబాగా పండును, నూతన పద్దతులతో కూడి ఉండును, తెలుపులు, బొబ్బర్లు, శెనగ, పొట్టి ధాన్యములు, ఔషద మొక్కలు బాగ ఉండును, స్త్రీ ఆధిపత్యము పెరుగును, మధు మేధవ్యాధి అధికముగా పెరుగును, రంగురాళ్ళ గిరాకి పెరుగును.  

ధాన్యాధిపతి :- భుదుడు  

అన్ని ధాన్యపు పంటలు బాగుండును, పెసర ధాన్యము బాగా పండును, అన్ని రకముల వ్యాపారములు అభివృద్ధిగా సాగును, దేశములో ఆహార ఉత్పత్తులు పెరుగును,  ఆర్ధిక మాన్యము తగ్గుటే కాక షేర్ మార్కట్టు రికార్డు స్థాయి ఉండును, గాలి వర్శాభావములు అధికము. 

అర్ఘాదిపతి :- చంద్రుడు 

విశేష వర్షములు, ప్రకృతి వైపరిత్యములు అధికము, జన జీవనము స్తంభించును, అక్కడక్కడ జలప్రళయములు ఉండును, కొన్ని వ్యాపారములు ధాన్యధరలు అధికము పెరుగును కొన్ని పడిపోవును,  దిగుమతులు తగ్గును.  

మేఘాదిపతి :-  చంద్రుడు 

దేశము అంతా వర్ష భావము అధికము.విశేష వర్షముల వాళ్ళ ప్రజా జీవనమునకు ఇబ్బంది కలుగును, ఉత్తరాదిన అధిక ప్రమాదములు,తమిళనాడు, కేరళ  తిర ప్రాంతములలో అధిక నష్టము ఉండును, పాడి పరిశ్రమ అభివృద్ధిగా ఉండును, ప్రజలు మానసికముగా ఇబ్బందులు ఎదుర్కోందురు, ప్రతి కుటుంబము లోను ఏదో ఒక సమస్యలు ఉండును, ధరలు పెరుగును.   

రసాధిపతి :- రవి 

కంటికి సంబదిత వ్యాధులు పెరుగును, పిడుగు బాట్లు, నెయ్యి, పంచదార, నూనె ధరలు పెరుగును, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలమద్య విభేదాలు ఇటువంటి వాటితో ప్రజలకు ఇబ్బంది కలుగును. ఉష్ట్నోగ్రత అధికముగా రికార్డుస్థాయిలో ఉండును, రక్షణ వ్యవస్థ సకాలములో సమస్యలను గుర్తించుట చే భారి ప్రమాదములు అరికట్టేదరు, విదేసములలో మన దెశ ఖ్యాతి పెరుగును.   

నీరసాధిపథి :-  శుక్రుడు 

సుఘంధ ద్రవ్య వ్యాపార రంగము మంచి అభివృద్ధిగా ఉండును,  మత్తు పానియముల ధరలు అధికమగును, పువ్వులు, పండ్లు ధరలు పెరుగును, ప్రజలు విలాస వంత జీవితము గడుపుదురు, కళాకారులకు మంచి సమయము, విదేశములలో ఉన్న ధనము బయటికి వచ్చును,  మహిళలకు అన్ని విధములా బాగుండును. 

moudyami and adhikamaasam

 మూఢమి 

 

గురుమూఢమి :- ది . 12-08-2015 తేది నిజ ఆషాడ బహుళ త్రయోదశి బుధవారము నుండి ది. 12-09-2015 తేది శ్రావణ బహుళ చతుర్ధశి శనివారము వరకూ 

శుక్ర మూఢమి :- ది.10-08-2015  నిజ ఆషాడ బహుళ ఏకాదశి సోమవారము నుంచి ది.20-08-2015 తేది శ్రావణ శుద్ధ షష్టి గురువారము వరకూ 

Puskaramulu and Grahanamulu

 

గోదావరి  నదికి ఈ సంవత్సరము పుష్కరము 

శ్రీ మన్మధనామ సంవత్సరం అధిక ఆషాడ బహుళ త్రయోదశి జయవారం [మంగళవారం]అనగా ది . 14-07-2015 తేది ఉదయం 6గం. 25 నిమిషములకు [ద్రిక్సిద్ధపద్ధతిన ..భారత ప్రభుత్వము ప్రకారము] సార్ధ త్రికోటి తిర్ధరాజ సహిత గోదావరి పుష్కర ప్రారంభం. అప్పటి నుంచి పన్నెండు రోజులు పుష్కర దినములుగా అవుతాయి.

సూర్య సిద్ధాంత ప్రకారము

శ్రీ మన్మధనామ సంవత్సరం అధిక ఆషాడ బహుళ షష్టి జయవారం [మంగళవారం]అనగా ది . 07-07-2015 తేది ఉదయం గోదావరి పుష్కర ప్రారంభం. అప్పటి నుంచి పన్నెండు రోజులు పుష్కర దినములుగా అవుతాయి.

2015 – 2016 సంవత్సరము లో గ్రహణములు

ఈ సంవత్సరము ప్రపంచములో 4 గ్రహణములు సంభవించును అయితే భారత దేశములో మాత్రము రెండు గ్రహణములు  మాత్రమే కాని పించును. 

1] ది. 04-04-2015 వ తేది చైత్ర శుద్ధ పౌర్ణిమా స్థిర వారము హస్తా నక్షత్రము  కన్యా రాశి యందు రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణము.  ఇదిభారతదేశం అంతటా  కనిపించును. 

సమయం :- స్పర్స మధ్యాహ్నం 03గం. 45 ని.ల నుండి రాత్రి 07 గం.15 ని.ల వరకు {IST]

   

2] ది . 13-09-2015 వ తేది శ్రావణ  బహుళ అమావాస్య ఆది వారము ఖండ గ్రాస సూర్య గ్రహణం, ఇది భారతదేశము లొ కనిపించదు.  

నియమములు ఏమియు పాటించ వలసిన అవసరము లేదు. 

3] ది. 28-09-2015 వ తేదీ బాద్రపద శుద్ధ పౌర్ణిమ సోమవారంసంపూర్ణ  చంద్ర గ్రహణం. ఇది దక్షణ భారతదేశము లొ కనిపించదు, గుజరాత, రాజ్కోట్,జామ్ నగర్, ద్వారకా, రాజస్థాన్, జై సల్మార్ లాటి ప్రాంతాలలో 4ని.లు మాత్రమే కనిపించును.   

దక్షణ భారతదేశము వారు నియమములు ఏమియు పాటించ వలసిన అవసరము లేదు.

4] ది 09-03-2016 వ తేది. మాఘ బహుళ అమావాస్య బుధ వారం పూర్వాభాద్ర నక్షత్ర కుంభ రాసి యందు  కేతు గ్రస్త పాదాదిక గ్రాస సూర్య గ్రహణము ఇదిభారతదేశం అంతటా  కనిపించును. 

 రాజమండ్రి కి సమయం :- స్పర్స ఉదయం 06గం. 15 ని.ల నుండి రాత్రి 06 గం.48 ని.ల వరకు {IST]

 

కర్తరి 

డొల్లు [చిన్న]కర్తరి :- ది 04-05-2015 వైశాఖ శుద్ధ పౌర్ణమి సోమవారము  నుంచి 

  

నిజ   [పెద్ద] కర్తరి :- ది .11-05-2015 వైశాఖ బహుళ అష్టమి సోమవారము నుండి ది. 28-05-2015 జ్యాస్త శుద్ధ దశమి గురువారము వరకూ, కర్తిరి సమయమున కర్ర మట్టి పనులు నిషిద్ధము. 

మకర సంక్రాంతి, ఫలములు

ది. 15-01-2016 వ తేది ఉదయం 06 గం.36 ని.లకు రవి[సూర్యుడు] మకర రాశి లో ప్రవేశించును, కావున గురువారము అనగా 15-01-2016 వ తేది మకర సంక్రాంతి చెయవలయును.

మకర సంక్రాంతి పురుషుడు మిశ్ర  నామము వరాహ [పంది] వాహనము

మిశ్ర నామం గోవులకు అరిష్టం, శంఖోదక స్త్నానం, ఆరోగ్యం మినుములు అక్షతలు మినుము ధాన్యం ధరలు అధికమగును,విచిత్ర్త వస్త్ర ధారణవల్ల ప్రజాసోవ్ఖ్యము, కుంకుమ గంధముచే యుద్ధ భయం, వకుల పుష్ప ధారణ వల్ల కీర్తి, వెండి ఆభరణ ధారణ వల్ల వెండి ధర తగ్గుట,రాగి పాత్ర వల్ల లోహ నాశనము, భక్ష్యములను భుజించుటవల్ల స్పోటక భయం, మామిడి పండ్లు తినుట వల్ల ప్రజాసౌఖ్యము, వరాహ వాహనము వల్ల మహిష నాశనము, ఖడ్గ ఆయుధముచే యుద్ధ భయం, పితచెత్రము చే పితవస్తు నాశనం, లజ్జచేస్ట వల్ల ప్రజా వృద్ధి, ఉత్తరదిక్కు ప్రయాణము వల్ల ఉత్తరాది రాష్ట్రములకు ఇబ్బందులు, ఊర్ద్వదిక్సితి వాళ్ళ రాజాదులకు శుభము.